గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:26 IST)

గూగుల్‌తో ఒప్పందం.. ట్రూకాలర్‌ యూజర్లకు వీడియో కాలింగ్

ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌తో లీడింగ్ కమ్యూనికేషన్ యాప్ ట్రూకాలర్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తన యూజర్లకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో కాలింగ్ సౌలభ్యం కో

ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌తో లీడింగ్ కమ్యూనికేషన్ యాప్ ట్రూకాలర్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తన యూజర్లకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో కాలింగ్ సౌలభ్యం కోసం ట్రూకాలర్.. గూగుల్ డ్యుయో‌ను అనుసంధానం చేసుకుంది.
 
దీనవల్ల యూజర్లు నేరుగా ట్రూకాలర్ ద్వారా వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం లభించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫ్లామ్‌లు రెండింటిపైనా ఇది పనిచేస్తుంది. మంగళవారం నుంచే యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 కోట్ల మంది ట్రూకాలర్ వినియోగదారులు అత్యంత నాణ్యత కలిగిన వీడియో కాల్స్ చేసుకోవచ్చని ట్రూకాలర్ తెలిపింది.