శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:30 IST)

రూ.5,971 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చిన ట్విట్టర్

వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపడం ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన దావాను పరిష్కరించుకునేందుకు ట్విట్టర్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.5,971 కోట్ల మేర చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ స్వయంగా వెల్లడించింది. 
 
సంబంధిత మొత్తాన్ని 2021 నాలుగో త్రైమాసికంలో చెల్లించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు జడ్జి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ట్విటర్‌ ఉన్నతాధికారులు 2014లో ఉద్దేశపూర్వకంగా తమ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ.. సంస్థ పెట్టుబడిదారుల్లో ఒకరైన డోరిస్‌ షెన్‌విక్‌ 2016లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి గమనార్హం.