గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:55 IST)

భారత మార్కెట్లోకి Vivo T2 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్.. ధరెంతో తెలుసా?

Vivo T2 5G
Vivo T2 5G
భారతదేశంలో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. దీంతో 5G స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా Vivo T2 5G దేశంలో గొప్ప ఫీచర్లతో ఆవిష్కృతం అయ్యింది. 
 
భారతదేశంలో వివిధ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న కంపెనీలలో వివో ఒకటి. భారతదేశంలో ఇటీవల 5G ప్రారంభించడంతో, Vivo కస్టమర్లను ఆకర్షించడానికి అధునాతన 5G ఫీచర్లతో Vivo T2 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
 
Vivo T2 5G స్మార్ట్‌ఫోన్ ముఖ్యాంశాలు:
Qualcomm Snapdragon 695, 6.38-అంగుళాల Turbo AMOLED డిస్ప్లే
ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 619 GPU
6 GB / 8 GB RAM, 128 GB ఇంటర్నల్ మెమరీ
 
Android 13, Fundach OS 13 ఆపరేటింగ్ సిస్టమ్
16 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
64 MP + 2 MP వెనుక డ్యూయల్ కెమెరా
 
వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ సెన్సార్,
4500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ C కేబుల్
6GB RAM/128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999, 8GB RAM/128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999.
Vivo T2 5G స్మార్ట్‌ఫోన్ నైట్రో ప్లేస్ మరియు వెలాసిటీ వేవ్ అనే రెండు రంగులలో లభిస్తుంది.