1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (10:12 IST)

'వందే భారత్' రైలు అని ఎందుకు అంటున్నారో తెలుసా...

vande bharat
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ళను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ సెమీ స్పీడ్ రైళ్లను రెండు తెలుగు రాష్ట్రల్లో కూడా ప్రారంభించారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణ చార్జీ, ప్రయాణ సమయం తదితర విషయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇతర రైళ్లు, వందే భారత్ రైళ్లలో ఉండే ప్రయాణ చార్జీలను పోల్చుతున్నారు. 
 
నిజానికి వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని ఊకదంపుడు ప్రచారం చేశారు. కానీ, వందే భారత్ టిక్కెట్ ధరలు మాత్రం సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేవు. పైగా వందే భారత్ కంటే ముందున్న రైళ్లే ఎంతో నయం అంటూ పెదవి విరుస్తున్నారు. 
 
తాజాగా సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త వందే భారత్ రైలు భాగ్యలక్ష్మి అమ్మవారి నగరం నుంచి వేంకటేశ్వర స్వామి ఉండే తిరుపతి నగరాన్ని అనుసంధానం చేస్తుంది అని అన్నారు. ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. 
 
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు ఉద్యోగుల కోసం నడిపే ప్రత్యేక రైలులో ప్రయాణ సంయం 3.53 గంటలు. టికెక్ట ధర రూ.480. అదే వందే భారత్‌‍ రైలులో గుంటూరుకు పట్టే సమయం 3.45 గంటలు. టిక్కెట్ ధర రూ.865. దీన్ని పోల్చుతా "అబ్బే.. నాకైతే గిట్టుబాటు కాదమ్మా" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. వందే భారత్ టిక్కెట్ బుక్ చేసుకుందామంటే భాగ్యలక్ష్మి టెంపుల్ రైల్వే స్టేషన్ కనిపించడం లేదంటూ ఒకరు ప్రధాని మోడీకి చురకలంటించారు. 
 
అలాగే, వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఇప్పటికే పదిసార్లు ప్రారంభించారు. దీనిపై కూడా నెటిజన్లు తమదైనశైలిలో సెటైర్లు వేశారు. దాన్ని వందేభారత రైలు అని ఎందుకు అన్నారో తెలుసా.. దాన్ని వందసార్లు ప్రారంభిస్తారు కాబట్టి అని వైఎస్ షర్మిల స్టైల్‌లో ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రం సంధించారు.