జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?
బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్' ఫోన్లకు 2017 వేరియంట్లను జూలై ఆరో తేదీన విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో ర
బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్' ఫోన్లకు 2017 వేరియంట్లను జూలై ఆరో తేదీన విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
వివో నుంచి వేరియంట్ ఫోన్లు రెండింటిలోనూ యూజర్లకు ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఓఎస్ లభించనుంది. అలాగే వివో ఎక్స్9ఎస్ ప్లస్ 2017 ఫోన్‌లో 5.85 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3950 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉంటాయి. ఈ రెండింటినీ మెటల్ బాడీతో రూపొందించారు. రెండూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను వివో సొంతం చేసుకుంది. 2017 సీజన్‌తో ఒప్పందం ముగియడంతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం వేలం నిర్వహించింది. ఈ వేలంలో వివో 2018 నుంచి 2022 వరకు రూ. 2199 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. ఇది గత కాంట్రాక్టుతో పోలిస్తే 554 శాతం అధికం కావడం విశేషం.