శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (22:22 IST)

వివో నుంచి మరో సరికొత్త మోడల్.. Vivo X100 ఫీచర్స్ లీక్

Vivo X100
Vivo X100
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో నుంచి మరో సరికొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. త్వరలో భారత మార్కెట్లోకి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతోంది. 
 
కాగా Vivo X100 లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీకయ్యాయి. వనిల్లా Vivo X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో Sony IMX920 ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. 1-అంగుళాల సోనీ IMX989 కెమెరా సెన్సార్‌ను ప్రైమరీ స్నాపర్‌గా, 4.3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో షూటర్‌ని కలిగి ఉంటుంది.
 
వివో X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో Sony IMX920 ప్రైమరీ సెన్సార్,
అల్ట్రా-వైడ్ షాట్‌ల కోసం Samsung JN1 లెన్స్, 
3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన OmniVision OV64B టెలిఫోటో కెమెరా ఉంటాయి.