శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (17:39 IST)

వివో మొబైల్ నుంచి జడ్ 3ఐ వేరియంట్ ఫోన్..

వివో మొబైల్ నుంచి జడ్ 3ఐ స్మార్ట్ ఫోన్ సిరీస్ చైనా మార్కెట్లోకి విడుదలైంది. వివో జడ్ 3ఐ స్టాండర్డ్ ఎడిషన్ అనే స్మార్ట్ ఫోన్‌ను వివో విడుదల చేసింది. అక్టోబర్‌లో విడుదల చేసిన జడ్ 3ఐ స్మార్ట్ ఫోన్‌కి వేరియంట్ ఇది. ఈ ఫోన్ అరోరా బ్లూ, డ్రీమ్ పింక్, స్టార్రి నైట్ అనే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. దీని ధర దాదాపు రూ.23,600పైగా వుంటుంది. 
 
మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌‌ను కలిగివుండే ఈ ఫోన్ 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగివుంటుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ60 చిప్ సెట్‌ని అమర్చారు.
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
3315 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
16/5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలను ఈ ఫోన్ కలిగివుంటుందని వివో ఓ ప్రకటనలో వెల్లడించింది.