శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (10:52 IST)

ఎలాంటి కాయకూరలు కొనాలి..?

కూరగాయలు ఎలా కొనాలి.. ఎలాంటి కాయగూరలు కొంటే మంచిది అనే ప్రశ్న చాలామందికి తరచూ ఎదురవుతూ ఉంటుంది. ఒకసారి ఈ క్రింది టిప్స్ ఫాలో అవ్వండి. మీరూ మాస్టర్ అవుతారు.
 
1. వంకాయలు ముడతలు పడకుండా ఉండాలి. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమి ఆకుపచ్చరంగులో, తోలునిగనిగ లాడుతూ ఉండాలి. పుచ్చలు లేకుండా చూడాలి.
 
2. బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. బంగాళాదుంపపైన నల్లటిమచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు, దుంపలమైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనండి.
 
3. అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో ఉన్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి.
 
4. ఉల్లిపాయలు గట్టిగా సన్నని మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ ఉంటే అసలు కొనవద్దు.
 
5. మంచి ఆకారం కలిగివున్న క్యారెట్టునే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా ఉన్న క్యారెట్‌ను కొనవద్దు. క్యారెట్ మొత్తం మెత్తగా ఉన్నా, అక్కడక్కగా మెత్తగా ఉన్నా కొనవద్దు. క్యారెట్ లేతగా ఉంటే మరీ మంచిది. క్యారెట్ నిల్వ ఉన్నట్లుయితే వూరకే మెత్తపడిపోతుంది.
 
6. బీట్‌రూట్ కొనేముందు దానికింద భాగంలో వేర్లువున్న వాటిని కొనండి. ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.
 
7. కాలిఫ్లవర్ కొనేముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్నఫ్లవర్‌ను కానవద్దు. పువ్వు విడిపోకుండా దగ్గరగా ఉన్న వాటినే కొనాలి. 
 
8. ఆకుకూరలు కొనేముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా ఉండేటట్లు చూసుకోవాలి.