స్మార్ట్‌ఫోన్ తెరలను శుభ్రం చేసేందుకు...?
టూత్‌పేస్ట్ దంతాల శుభ్రానికే కాదు.. మరెన్నో వాటిని ఉపయోగపడుతుంది. టూత్‌పేస్ట్ వలన దంతాలు మాత్రం శుభ్రం చేసుకోవచ్చని.. చాలామందికి అనుకుంటున్నారు. కానీ, వాస్తవానికి వస్తే టూత్‌పేస్ట్ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని సరిగ్గా ఉపయోగించుకోవాలే గానీ టూత్‌పేస్ట్ చాలా పనులకు ఉపయోగపడుతుంది. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
1. చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. టూత్‌పేస్ట్‌ను మొటిమలు రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమల సమస్య పోతుంది.
2. స్మార్ట్‌ఫోన్ తెరలను శుభ్రం చేసేందుకు టూత్‌పేస్ట్‌ను వాడొచ్చు. ఎలాగంటే.. కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకుని ఫోన్ స్క్రీన్‌పై రాయాలి. ఆపై మెత్తని వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే ఫోన్ స్క్రీన్ మెరుస్తుంది. స్క్రాచ్‌లు ఉన్నా కనిపించవు.
3. కాలిన గాయాలు, పురుగు కుట్టిన ప్రాంతంల్లో పేస్ట్‌ను రాసుకుంటే నొప్పి, మంట నుండి ఉపశమనం లభిస్తుంది. అద్దాలు మసకగా కనిపిస్తున్నాయా.. అయితే టూత్‌పేస్ట్‌ను వాటిపై రాసి గుడ్డతో శుభ్రం చేయండి.. ఫలితం ఉంటుంది.
4. వెండి, ఇత్తడి వస్తువులు పాతగా కనిపిస్తుంటే.. వాటిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాసి వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పాతవి కూడా కొత్తగా మెరుస్తాయి.
5. దుస్తులపై పడే మరకలను తొలగించాలంటే.. టూత్‌పేస్ట్‌ను ఆ మరకలపై కొద్ది కొద్దిగా రాయాలి. ఇలా చేయడం వలన మరకలు తొలగిపోతాయి.