శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (13:07 IST)

అందుబాటులోకి వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఆప్షన్

వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ వాళ్ళ వాట్సాప్‌ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్‌లోకి మారుతుంది. దీనివల్ల కళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. ఇక యూజర్లు సెట్టింగ్స్‌లోని చాట్స్‌, థీమ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్‌ అనే ఫీచర్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. 
 
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎంతో కాలంగా వాట్సాప్‌ డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించిన వాట్సాప్ ప్రస్తుతం ఎట్టకేలకు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
 
ఆండ్రాయిడ్10 ఐఓఎస్ 13 లోని వినియోగదారులు సిస్టమ్ సెట్టింగులను ప్రారంభించడం ద్వారా డార్క్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ 9 పైను వాడుతున్న వినియోగదారులు మొదటగా వాట్సాప్‌ను ఓపెన్ చేసి అందులోని సెట్టింగులను ఓపెన్ చేయాల్సి వుంటుంది. తరువాత అందులోని చాట్స్ విభాగంను ఎంచుకోవాలి. తరువాత థీమ్ విభాగంలోకి వెళ్లి అందులోని డార్క్ మోడ్‌ను ఎంచుకోవాలని వాట్సాప్ ప్రకటించింది.