మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Modified: గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:19 IST)

వాట్సాప్ నుంచి బంపర్ ఫీచర్... ఇక ఎవరి వల్లా కాదు... ఏంటది?

రోజుకో సరికొత్త ఫీచర్లతో వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు నవీకరిస్తోంది దాని ప్రధాన సంస్థ ఫేస్‌బుక్‌. ఫోన్‌కు పాస్‌వర్డ్‌, ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ ఐడీతో లాక్‌ ఉంచవచ్చు. అలా లాక్ చేసిన ఫోన్‌ను అన్‌లాక్ చేసినప్పుడు ఆ ఫోన్‌లోని చాలా యాప్స్‌ను ఎవరైనా వాడవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్యలకే వాట్సాప్ ఒక పరిష్కారం కనుగొంది.
 
త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది వాట్సాప్. ఇక నుంచి వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలంటే కచ్చితంగా బయోమెట్రిక్‌ ధృవీకరణ ఉండాల్సిందే. అంతేకాకుండా వాట్సాప్‌ సందేశాలను స్క్రీన్‌ షాట్‌  తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్‌ప్రింట్ ఇవ్వాల్సిందే. ఈ సరికొత్త ఫీచర్లను త్వరలోనే వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. 
 
అయితే, స్క్రీన్‌షాట్స్ సేవ్ చేసుకోవడానికి బయోమెట్రిక్ ఆప్షన్‌ తప్పనిసరి కాదు. వినియోగదారులు స్క్రీన్‌షాట్స్‌ తీయడానికి అనుమతి కావాలా వద్దా అనే విషయం వారే ఎంచుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటేనే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు.