బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (13:32 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. తేదీల వారీగా సర్చ్ చేసుకోవచ్చు..

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. తేదీల వారీగా సందేశాలను అన్వేషించి గుర్తించే విధంగా కొత్త అప్ డేట్ రానుంది. కొత్త  అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ రానుంది. 
 
యూజర్లు ముందు తమ ఫోనులో వున్న వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి వుంటుంది. తద్వారా సందేశాలను తమకు తామే పంపుకునే అవకాశం వుంది. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ యాప్ అప్డేషన్‌తో అందుబాటులోకి రానుంది.  
 
అలాగే ఇతర యాప్స్‌లో ఉన్న వీడియో, ఫొటోలు, డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటే.. వేరే యాప్‌లో ఉన్న వాటిని డ్రాగ్ చేసి తీసుకొచ్చి వాట్సాప్‌లో డ్రాప్ చేసే ఫీచర్ కూడా తాజా అప్‌డేట్‌తో అందుబాటులోకి రానుంది