శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:47 IST)

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? అడ్మిన్లు కేర్ ఫుల్‌గా ఉండాల్సిందే.. లేదంటే జైలే!?

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అడ్మిన్‌‌గా కేవలం గ్రూపులో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా గ్రూపులో పోస్ట్ అయ్య

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారా? గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అడ్మిన్‌‌గా కేవలం గ్రూపులో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా గ్రూపులో పోస్ట్ అయ్యే వాటిపై కన్నేసి వుంటాలని ఐటీ నిపుణులు అంటున్నారు. లేకుంటే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన తప్పిదానికి వీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. 
 
ఇకపై గ్రూప్‌‍లో పోస్టు చేసే రూమర్లకు, ఫేక్ న్యూస్ స్టోరీలకు లేదా అసహ్యకరమైన వీడియోలకు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి వుంటుందని వారణాసి సర్కారు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు, మార్పుడ్ ఫోటోగ్రాఫులకు అభ్యంతరకమైన వీడియోలకు సోషల్ మీడియాలో కోకొల్లలు కనిపిస్తుంటాయి. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు.. మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసే వారిపై వారణాసి సర్కారు కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యింది. 
 
గ్రూపులో ఇతర యూజర్లు పోస్ట్ చేసిన కంటెంట్‌కు గ్రూపు అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టిస్తూ వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తామని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు హెచ్చరించారు.