శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (20:34 IST)

వాట్సాప్ ఏ ఫోన్లలో పనిచేయదో తెలుసా?

పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడుతుంటే.. వెంటనే అప్డేట్ చేయాల్సిందే. లేకుంటే మొబైల్‌లో వాట్సాప్ ఏమాత్రం పనిచేయదు. మెరుగైన సేవలను అందించేందుకు మరిన్ని అప్డేట్స్ వాట్సాప్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇకపై పాత ఫోన్లలో తమ సేవలను నిలిపివేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ తమ సేవలను నిలిపివేసే అవకాశం ఉంది. 
 
ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌పై క్లిక్ చేస్తే ఎబౌట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోన్ వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా KaiOS 2.5.1 అంతకంటే అడ్వాన్స్‌డ్ వర్షన్‌ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఈ ఓఎస్‌ జియో ఫోన్‌, జియో ఫోన్‌2లో ఉంది.
 
ప్రస్తుతం ఐఓఎస్‌లో వాట్సాప్ 2.21.50 వెర్షన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్ 4S వాడుతున్నట్లయితే ఇది మీ యాప్ స్టోర్‌లో కనిపించదు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఐఫోన్ 4S తర్వాత మొబైల్స్ ఉండాలి.
 
అదే ఐఫోన్ 5 దాని తర్వాత మోడల్స్ ఉపయోగించినట్లయితే మీ ఐఓఎస్‌10కు అప్‌డేట్ చేసుకోవాలి. ఐఓఎస్ 9 దానికంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్‌(ఓఎస్‌) ఉంటే మీ మొబైల్‌లో వాట్సాప్ సేవలను నిలిచిపోయే అవకాశం ఉంది.
 
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అయితే 4.0.3 ఓఎస్ కంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అంటే శాంసంగ్ గ్యాలక్సీ జడ్ ఫ్లిప్‌, శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 10.1, శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్‌, హెచ్‌టీసీ వన్ వీ, హెచ్‌టీసీ డిసైర్ సీ, హెచ్‌టీసీ డిసైర్ ఎస్‌, సోనీ ఎక్స్‌పీరియా టేబుల్ ఎస్‌, సోనీ ఎక్స్‌పీరియా నియో సహా పలు ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 అంతకంటే పాత వర్షన్ ఓఎస్ ఉంది. కాబట్టి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.