శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (09:32 IST)

వాట్సాప్‌లో కొత్త పీచర్.. సెట్టింగ్స్‌లోనూ సెర్చ్ ఆప్షన్...

whatsapp
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ముఖ్యంగా, ఆండ్రాయిడ్ యూజర్లకు కోసం ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. అయితే, వాట్సాప్ సెట్టింగ్స్‌లనూ ఓ సెర్చ్ ఫీచర్‌ను తీసుకుని రానుంది. అయితే, ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనేవుంది. 
 
అతి తక్కువమంది యూజర్లకు మాత్రం ఈ సెర్చ్ ఆపరేషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగిలిన యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సెర్చ్ బార్ సాయంతో సెట్టింగ్స్‌ విభాగంలో మనకు కావాల్సిన అంశాన్ని నేరుగా వెదికే వెసులుబాటు ఉంటుంది. బీటా వెర్షన్‌లో ఈ సెర్చ్‌బార్‌కు సంబంధించిన ఐకాన్ దర్శనమిస్తుంది. ఈ ఐకాన్ ఉంటే సెట్టింగ్స్‌లోనూ సెర్చ్ చేయొచ్చు. 
 
కాగా, ఒకే వాట్సాప్ ఖాతాను రెండు మూడు స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించుకునే ఫీచర్‌పై కూడా వాట్సాప్ టెక్నికల్ నిపుణులు కసరత్తులు చేస్తున్నారు. దీన్నే కంపానియన్ మోడ్‌గా పిలుస్తారు. ప్రధాన డివైస్‌లో ఉండే వాట్సాప్ ఖాతాను ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో యాక్సెస్ చేసుకునేందుకు ఈ కంపానియన్ మోడ్ దోహదపడుతుంది. ఫలితంగా వాట్సాప్‌ను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్‌లలో ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.