సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (19:37 IST)

ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ (video)

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తన యూజర్లకు మరోకొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచర్ యూజర్లకు లభిస్తుంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు కొంత నిర్దిష్టమైన సమయం తరువాత వాటికవే ఆటోమేటిగ్గా అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను తెస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

అయితే వాటిని వాట్సాప్ త్వరలో నిజం చేయనుంది. ఎందుకంటే ఆ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా యాప్‌లో పరీక్షిస్తున్నారు. అందువల్ల ఆ ఫీచర్ అతి త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. 
 
ఈ ఎక్స్‌ఫైరింగ్ మెసేజేస్ ద్వారా ఇక వాట్సాప్‌లో యూజర్ పంపే మెసేజ్ ఎంత సేపటి తరువాత అదృశ్యం అవ్వాలో సెట్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.


ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల.. ఇలా యూజర్ తనకు ఇష్టం వచ్చినట్లు ఆ సదుపాయాన్ని సెట్ చేసుకోవచ్చు. దీంతో ఆ యూజర్ పంపే మెసేజ్‌లు ఆ సమయం తరువాత వాటికవే అదృశ్యమవుతాయి.

అయితే గ్రూప్‌లలో పంపే మెసేజ్‌లకు మాత్రం అడ్మిన్ ముందుగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీచర్ అతి త్వరలోనే వాట్సాప్ యూజర్లకు లభ్యం కానుంది.