వాట్సాప్‌పై హ్యాకర్స్ బ్రెజిల్ కన్ను.. వాట్సాప్ క్రాష్‌తో..?
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్ యూజర్స్‌కి మరింత చేరువవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్ వైరస్‌తో వాట్సాప్ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.
ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు తెలిపింది. కొద్ది రోజుల కిత్రం వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లలో ఎలాంటి కొత్త ఫీచర్స్ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది.
ఎలాంటి అర్థం లేని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్‌ను వరుస క్రమంలో ఉంచి ఒక సందేశం లేదా ఏదైనా ఆర్ట్ రూపంలో సృష్టించి ఫార్వార్డ్ మెస్సేజ్‌లా పంపుతారు. దానిని రిసీవ్ చేసుకున్న వారు తెరవగానే వాట్సాప్ క్రాష్ అవుతుంది.
కొన్నిసార్లు వాట్సాప్‌ను క్లోజ్ చేసి, తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే ఫోన్ క్రాష్ అయ్యే అవకాశమూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు ఎలాంటి తాత్కాలిక పరిష్కారం లేదని వాబీటాఇన్ఫో తెలిపింది.