బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (17:49 IST)

వామ్మో... మీ మొబైల్ ద్వారా మీకు తెలియకుండానే డబ్బు 'cleaning'...

మీ మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా...? ఐతే చాలా జాగ్రత్తగా వుండాలండి బాబూ. లేదంటే మీకు తెలియకుండానే మీ మొబైల్ యాప్ ద్వారా డబ్బులు clean అయిపోతాయి. క్లీనయిపోవడమేమిటి అనుకుంటున్నారా... అదే మీ మొబైల్ మెమరీ క్లీన్ చేస్తామంటూ కొన్ని యాప్ లు మిమ్మిల

మీ మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా...? ఐతే చాలా జాగ్రత్తగా వుండాలండి బాబూ. లేదంటే మీకు తెలియకుండానే మీ మొబైల్ యాప్ ద్వారా డబ్బులు clean అయిపోతాయి. క్లీనయిపోవడమేమిటి అనుకుంటున్నారా... అదే మీ మొబైల్ మెమరీ క్లీన్ చేస్తామంటూ కొన్ని యాప్ లు మిమ్మిల్ని అడుగుతాయి. అంతేకాదు... మరికొన్ని మీ బ్యాటరీ పవర్ పెంచుతామంటూ వచ్చేస్తాయి. 
 
సర్లే అనుకుని వాటిని డౌన్లోడ్ చేసారో... ఇక అంతే... మీ ఖాతాల్లోకి చొరబడి గుల్లగుల్ల చేసేస్తాయి. డబ్బులు మీకు తెలియకుండానే మీ ఖాతా లోనుంచి వెళ్లిపోతుంది. చివరికి నెలవారీ స్టేట్మెంట్ చూస్తే షాకవ్వాల్సిందే. ఈ రకమైన మాల్వేర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు సైబర్ క్రైం హెచ్చరిస్తోంది. 
 
క్జేఫ్‌కాపీ ట్రోజన్ పేరుతో చొరబడే ఈ సైబర్ థ్రెట్ ఒక్కసారి మొబైల్ ఫోనులో డౌన్లోడ్ అయ్యిందంటే ఇక డబ్బులు గుల్లగుల్లే. ఇప్పటివరకూ ఈ సైబర్ నేరగాళ్ల బారిన ప్రపంచంలోని 47 దేశాలు పడినట్లు తెలుస్తోంది. వీటిలో మనదేశం కూడా వుంది. 40 శాతం మంది మొబైల్ యూజర్లు ఇప్పటికే ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు.
 
ఒక్కసారి క్జేఫ్‌కాపీ మీ మొబైల్లో యాక్టివేట్ అయితే వైర్‌లెస్ అప్లికేషన్ల ద్వారా మీరు మొబైల్ పేమెంట్లు చేసేందుకు వాడే కార్డ్ నెంబరు, పిన్ నెంబరు, రహస్య కోడ్ మొత్తం లాగేస్తుంది. ఇక దానితో మీ సమాచారం తస్కరణకు గురైన సంగతే మీకు తెలియకుండా పోతుంది. అంతేకాదు... మీ ఫోన్ నెంబరును ఎన్నో సర్వీసులకు ఆటోమెటిగ్గా సబ్‌స్క్రైబ్ అయిపోతుంటుంది. సైబర్ నేరాలను అడ్డుకట్ట వేసే కాస్పర్‌స్కై మొబైల్ యూజర్లకు, ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులను హెచ్చరిస్తోంది. తెలియని యాప్స్ పొరబాటున కూడా డౌన్లోడ్ చేయవద్దని వెల్లడించింది. 
 
క్జేఫ్‌కాపీ మాల్వేర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ ను కాపాడుకునేది ఎలాగా...? అంటే... నిత్యం మీ ఫోనును లేటెస్ట్ ఫర్మ్‌వేర్‌తో అప్‌డేట్ చేసి వుంచాలి. చాలా కంపెనీలు సెక్యురిటీ ప్యాక్‌లను పంపిస్తాయి. వాటిని వెంటనే అప్‌డేట్ చేస్కుంటూ వుండాలి. తర్వాత చేద్దాంలే అని అశ్రద్ధ చేయకూడదు. యాంటి వైరస్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా వుండి తీరాలి. గుర్తు తెలియని వారి నుంచి వచ్చే ఇమెయిళ్లను పొరబాటును కూడా ఓపెన్ చేయవద్దు. అలాగే గుర్తింపులేని, గుర్తు తెలియని వారి నుంచి వచ్చే యాప్స్ ఇన్‌స్టాల్ చేయవద్దు.