శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:00 IST)

మూడు కెమెరాలు.. 12 జీబీ ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ 9

రోజుకో కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేస్తూ దేశీయంగా రోజురోజుకీ మొబైల్ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్న సంస్థ షియోమీ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. మిగిలిన కంపెనీల మొబైల్ ఫోన్‌లతో పోల్చితే ఎక్కువ ఫీచర్‌లు ఉన్న ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమీ తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ-9 విడుదల చేసింది.
 
ప్రపంచంలోనే క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందించే ఫోన్ ఇదే కావడం విశేషం. 6.39 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఎంఐ-9 స్మార్ట్ ఫోన్ ధర రూ. 31,000 కాగా ఎంఐ-9 ఎక్స్‌ప్లోరర్ ధర రూ. 42,000గా నిర్ణయించారు. దీన్ని 6 జీబీ ర్యామ్ - 128 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ - 256 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌లలో అందిస్తున్నారు. 
 
ఈ ఫోన్ వెనుక ఉన్న మూడు కెమెరాలు 48, 12, 16 మెగా పిక్సెల్‌లతో అందించబడ్డాయి, దీని ముందువైపు కెమెరా 20 మెగా పిక్సెల్‌తో అందించబడింది. దీనికి గొర్రిల్లా 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌తో కూడా అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లలో ఇంత భారీ మొత్తంలో ర్యామ్ ఉండటం చాలా పెద్ద విశేషం. ఈ ఫోన్లు ఈ నెల 26 నుండి అందుబాటులోకి రానున్నాయి.