శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:05 IST)

వివో నుంచి #VivoV15Pro విడుదల.. 32ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో..

చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచంలోనే మొదటిసారిగా 32ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. బుధవారం నాడు వివో వి15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో మొబైల్ సంస్థ పేర్కొంది. మొబైల్‌కి వెనుకవైపున మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా పొందుపరిచారు. దీని ప్రారంభ ధర రూ. 28,990గా నిర్ణయించారు. ఈ మోడల్ మార్చి 6వ తేదీ నుండి ఆన్‌లైన్ విక్రయ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.
 
వివో వి15 ప్రొ ఫీచర్‌లు:
6.39 అంగుళాల అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ
48+5+8 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరా
32 ఎంపీ పాప్-అప్ సెల్ఫీ కెమెరా
3,700 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయెల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం