ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (15:29 IST)

రూ.2,200లకు మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ సాఫ్ట్‌వేర్!

సాధారణంగా కంప్యూటర్లలో పీడీఎఫ్ సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ విండోస్ పీసీలను వాడుతున్న వారికి మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.2,200 విలువైన అలాంటి ఓ పీడీఎఫ్ సాఫ్ట్ వేర్‌ను ఉచితంగా అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ స్టోర్‌లో పీడీఎఫ్ మేనేజర్ అనే సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని ధర 30 డాలర్లు. అంటే దాదాపుగా రూ.2,200. కానీ దీన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఉచితంగానే అందిస్తోంది. 
 
ఈ ఆఫర్ జూలై 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనుక పీడీఎఫ్‌లతో రోజూ పనిచేసేవారు కచ్చితంగా ఈ సాఫ్ట్ వేర్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీంతో పీడీఎఫ్‌లను చక్కగా నిర్వహించుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్‌కు చెందిన పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో పీడీఎఫ్‌లను సులభంగా మెర్జ్ చేయవచ్చు. పీడీఎఫ్ ఫైల్స్ ను ఎడిట్ చేయవచ్చు. ఫైల్స్ ఆర్డర్‌ను మార్చకోవచ్చు. పేజీలను విడగొట్టొచ్చు. 
 
ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్‌లో ఉన్న ఫైల్స్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయవచ్చు. వాటిని అవసరం అయితే రొటేట్‌, డిలీట్ చేయవచ్చు. దీని వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇంకా పలు ఇతర సదుపాయాలు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో ఉన్నాయి.