సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (15:30 IST)

మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ సిరీస్‌లో సరికొత్త ల్యాప్‌టాప్.. ధరెంతో తెలుసా?

Laptop
అంతర్జాతీయ టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎలక్ట్రానిక్​ తాజాగా తన సర్ఫేస్​ సిరీస్​లో సరికొత్త ల్యాప్​టాప్​ను భారత మార్కెట్​లో విడుదల చేసింది. సర్ఫేస్ 4 పేరుతో లాంఛ్ అయిన ఈ ల్యాప్​టాప్​ ధరను రూ. 1,02,999గా నిర్ణయించింది. 13.5 అంగుళాల ఈ బేస్ మోడల్‌లో AMD రైజెన్ 5 4680U ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD స్టోరేజ్​ని అందించింది. 
 
భారత్​లోని కమర్షియల్​, ఎడ్యుకేషన్​ కస్టమర్ల అన్ని అవసరాలను తీర్చే విధంగా ఈ ల్యాప్​టాప్​ను డిజైన్​ చేశారు. ఇది బ్లాక్​, ప్లాటినమ్​ కలర్ల ఆప్షన్లలో అల్కాంటారా లేదా మెటల్ ఫినిషింగ్‌తో అందుబాటులో ఉంటుంది. దీన్ని గుర్తింపు పొందిన రిటైల్​ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్​ ప్లాట్​ఫామ్​ అమెజాన్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 
 
సర్ఫేస్​ ల్యాప్​టాప్​లో మైక్రోసాఫ్ట్ AMD రైజెన్, ఇంటెల్​ కోర్​ చిప్​సెట్​ వంటి రెండు ఆప్షన్లను చేర్చింది. ఈ ల్యాప్​టాప్​ 13.5 అంగుళాలు, 15 అంగుళాల టచ్​స్క్రీన్​ వేరియంట్లలో లభిస్తుంది. 
 
13.5- అంగుళాల వేరియంట్​ ప్రొడక్టివిటీ, పోర్టబిలిటీకి, 15 అంగుళాల వేరియంట్​ మల్టీ టాస్కింగ్‌కు అనువుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్​ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4లో 11 వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ లేదా AMD రైజెన్ 4000 ప్రాసెసర్‌ లభిస్తుంది. వీటికి తోడు రేడియన్ గ్రాఫిక్స్ సపోర్ట్​ కూడా ఉంటుంది.