గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (12:19 IST)

ట్విట్టర్‌లో భారీ మార్పులు.. ఆదివారం ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్

twitter deal elon musk
ట్విట్టర్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను మార్చుతున్నట్టు ఆ సంస్థ కొత్త అధిపతి ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం తెలిపారు. 
 
మైక్రో మెసేజ్ సైట్‌ను ఎలాన్ మస్క్ ఇటీవల కొనుగోలు చేసిన విషయంతెల్సిందే. ఆ తర్వాత ట్విట్టర్‌లో పెను మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ట్విటర్‌లో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను తప్పించారు. ఇపుడు ట్విటర్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. 
 
ముఖ్యంగా, బ్లూ చెక్ మార్క్ కోసం ఇప్పటివరకు చేస్తున్న వెరిఫికేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకుని రానున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, బ్లూ చెక్ మార్క్ కావాలనుకునే యూజర్లు ఇప్పటివరకు నెలకు రూ.410 చెల్లిస్తూ వచ్చారు. ఇకపై దీన్ని రూ.1650కు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.