శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (17:43 IST)

పిల్లలు ఆవు పాలు తాగకపోతే..?

పిల్లలు పాలు తాగాలంటే వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు.. ఓర్లాండో పరిశోధకులు. ఆవు పాలును తాగకుండా మారాం చేసే పిల్లల్లో బరువు తగ్గడం, ఎత్తు పెరగకపోవడం వంటివి జరుగుతాయి.

పిల్లలు పాలు తాగాలంటే వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు.. ఓర్లాండో పరిశోధకులు. ఆవు పాలును తాగకుండా మారాం చేసే పిల్లల్లో బరువు తగ్గడం, ఎత్తు పెరగకపోవడం వంటివి జరుగుతాయి.

ఈ మేరకు అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ అలెర్జీ, ఆస్తమా అండ్ ఇమ్మూనోలజీ/ వరల్డ్ అలెర్జీ ఆర్గనిజేషన్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో చిరు ప్రాయంలో ఆవు పాల తాగకుండా ఎదిగే పిల్లలు కౌమార దశలో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేల్చారు. 
 
ఒకవేళ పాలు తాగడం ద్వారా అలెర్జీలు వంటివి చిన్నారుల్లో ఏర్పడినట్లైతే ప్రత్యామ్నాలు తప్పనిసరి అంటూ పరిశోధకులు హెచ్చరించారు. ఆవు పాలకు బదులు కోడిగుడ్డు, చేపలు, గోధుమలు సోయా, వేరుశెనగలు పిల్లల డైట్‌లో చేర్చాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 
 
ఇలా ప్రత్యామ్నాయాలు తీసుకునే పిల్లల్లో ఎదుగుదల సమస్య కనిపించలేదని.. అందుకే ఆవు పాలు తీసుకోని చిన్నారులు తప్పకుండా సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ వంటివి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే పిల్లల ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు వుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.