1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (14:03 IST)

తన స్థానము తప్పినపుడు ఎంతటి వారికైనా...?

స్థానము తప్పివచ్చునెడ దా నెటువంటి బలాధ్యుడున్ నిజ
స్థానికుడైన యల్పునికతంబున నైనను మోసపోవుగా
కానలలోపల న్వెడలి గంధగజంబొకనాడు నీటిలో
గానక చొచ్చినన్ మొసలికాటుకలో బడదోటు భాస్కరా...
 
పూర్మం ఒక ఏనుగు తన తోడి ఏనుగులతో గూడి అడవిలో తిరుగుచు దిప్పిగొని ఒక మడువులోకొచ్చి నీరు త్రాగబోయి అక్కడ ఓ మొసలిచే జిక్కి వేయి వత్సరములు పోరాడియం స్థానబలముగల యా మకరమును వదల్చుకొనలేక నార్తత్రాణపరాయణుడగు నారాయణ గూర్చి మొఱయిడి ఈ దేవునిచే విడిపింపబడియెను. తన స్థానము తప్పినపుడు ఎంతటి వారికైనా అల్పుల చేత పరాభవము తప్పదు కదా...