1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (14:25 IST)

భగవంతుని అనుగ్రహం లేనప్పును హీనుని కొలువవలసి వచ్చును...?

చంద్రకళావతంను కృప చాలనివాడు మహాత్ముడైన దా
సాంద్రవిభూతి బాసి యొక జాతివిహీనుని గొల్పియుంట యో
గీంత్రనుతాంఘ్రిపద్మ మతిహీనత నొందుట కాదుగా హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడె నాడు భాస్కరా...
 
పూర్వము హరిశ్చంద్రుడను రాజు దైవ కృపలేక కాటి కాపరియై వీరబాహుని సేవింపవలసి వచ్చెను. కావున ఎంతగొప్ప వారికైనను భగవంతుని అనుగ్రహం లేనప్పును హీనుని కొలువవలసి వచ్చును. అటుల కొలుచుట తప్పుకాదు. రాజధాని యయోధ్య. కొడుకు లోహితాస్యుడు. భార్య చంద్రమతి. ఈ రాజు విశ్వామిత్రుడను ఋషికి గొంత ధనమిచ్చెని యొప్పుకుని తఱితో దానిందీర్చలేక కొంతకాలం కాశీపట్టణం నుండు వీరభాహు వను కాటికాపరి దాస్యముచేసి ఋణవిముక్తిని జేసికొనెను.