కృష్ణా పుష్కర పుణ్య స్నానమాచరించిన గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎల్. నరసింహన్ బుధవారం ఉదయం విజయవాడలోని విఐపి ఘాట్ నందు కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించారు. ఈ సందర్భంగాగా ఆయన మాట్లాడుతూ.... నదులు ప్రజల జీవన విధానానికి ప్రాణాధారమన్నార
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎల్. నరసింహన్ బుధవారం ఉదయం విజయవాడలోని విఐపి ఘాట్ నందు కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నదులు ప్రజల జీవన విధానానికి ప్రాణాధారమన్నారు.
పంటలు పండాలన్నా, జీవరాసులు బ్రతకాలన్నా నీరు ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రిపై వేంచేపి ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని రాష్ట్ర అతిథి గృహానికి చేరుకున్నారు.