మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (09:36 IST)

కేంద్రంలో హంగ్ తథ్యమంటున్న ఏబీపీ

దేశంలో ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో దాదాపుగా అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని కట్టబెట్టాయి. కానీ, ఒక్క ఏబీపీ మాత్రం ఎన్డీయ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాదని తేల్చిపారేసింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 267 సీట్లు, యూపీఏకు 127, ఇతరులకు 148 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న మొత్తం 542 లోక్‌సభ సీట్లకుగాను తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి మినహా మిగిలిన 541 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కాగా, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లను సాధించాల్సివుంది. ఏబీపీ సర్వే ఫలితాల ప్రకారం కేంద్రం హంగ్ తథ్యమని చెబుతోంది. కాగా, ఈ నెల 23వ తేదీన అసలు ఫలితాలు వెల్లడవుతాయి.