ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (12:46 IST)

కేంద్రంలో "హంగ్" ఖాయమా?... యూపీఏకు అత్యధిక సీట్లు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది దశ పోలింగ్ మే 19వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
అయితే, ఈ ఫలితాల తర్వాత కేంద్రంలో హంగ్ ఏర్పడనుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, అధికార బీజేపీకి గణనీయమైన సీట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క పార్టీకే 282 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి 304 సీట్లు సాధించాయి. కానీ, తాజాగా ఎన్నికల్లో బీజేపీకి 100కు పైగా సీట్లు తగ్గిపోతాయని అంటే 171 సీట్లకు పడిపోవచ్చని తెలిపింది. 
 
గత ఎన్నికల్లో 54 స్థానాల్లో గెలిచిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బలం 23 సీట్లకు పరిమితమవుతాయని ముంబైకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. అలాగే, గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే బలం 336 ఉండగా, ఈదఫా 194 సీట్లకు తగ్గిపోవచ్చని పేర్కొంది. 
 
ముంబైకు చెందిన సంస్థ అంచనా 193 స్థానాలున్న దక్షిణ, తూర్పు భారతంలో ఎన్డీయేకు 29, యూపీఏకు  68, తటస్థ పార్టీలకు 61కు వస్తాయని అంచనా వేసింది. ఇక మధ్య భారతంలో ఎన్డీయేకు 69, యూపీఏకు 72 స్థానాలు, ఉత్తర భారతంలో ఎన్డీయేకు 64, యూపీఏకు 35 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 
 
అయితే, ఈ ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏయేతర పార్టీల కీలక పాత్ర వహిస్తాయని పేర్కొంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తటస్థ పార్టీలు ఏకంగా 142 సీట్లు లభిస్తాయని పేర్కొంది. ఈ పార్టీలే ప్రభుత్వ ఏర్పాట్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. 
 
ఈ తటస్థ పార్టీల్లో ఎస్పీ 21, బీఎస్పీ 17, ఆర్ఎల్డీ 2, టీడీపీ 18, లెఫ్ట్ పార్టీలు 9, టీఎంసీ 34, ఆప్ 2, ఎన్.సికి 2 సీట్లు, బీజేడీకి 12 చొప్పున సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీలు కేంద్రంలో అత్యంత కీలక భూమికను పోషిస్తాయని పేర్కొంది.