సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (22:10 IST)

ద్యావుడా.. జనం ఏరీ..? రాహుల్ గాంధీకి షాక్..!

జహీరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ జరిగింది. కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ కోసం ప్రయత్నం చేశారు. కానీ జనమే రాలేదు. అందరూ స్టేజ్ పైనే ఉన్నారు. స్టేజ్ కింద అసలెవరూ లేరు. దీంతో రాహుల్ గాంధీ షాకయ్యారు.
 
ఎందుకు ఇలా జరిగిందంటూ  రాహుల్ గాంధీ స్థానిక నేతలపై సీరియస్ అయిపోయారు. జనం ఎక్కడికి పోయారు. అసలు తీసుకురాలేదా  అంటూ అందరి చెవులు కొరుక్కుంటూ కూర్చున్నారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తే మీరు చేసేది ఇదా అంటూ మండిపడ్డారు రాహుల్. దీంతో ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సైలెంట్ అయిపోయారు.