శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By జె
Last Modified: సోమవారం, 25 మార్చి 2019 (16:39 IST)

నరసాపురంలో నాగబాబు పరిస్థితి ఎలా వుందో తెలుసా?

ఎన్నికల సమయంలో ఉన్నట్లుండి హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు సినీనటుడు నాగబాబు. తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం ఎంపిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారాయన. ఇప్పటివరకు రాజకీయాలంటే తెలియని నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మాత్రం కొంతమంది నేతలపై విమర్సలు చేస్తూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ వచ్చారు.
 
అయితే అనూహ్యంగా ఉన్నట్లుండి పోటీలోకి దిగారు నాగబాబు. తన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ నేతలతో పాటు కలిసి ఉన్న సిపిఐ, సిపిఎం, బిఎస్పీ నేతలందరూ వెంట వస్తారని భావించారు నాగబాబు. అయితే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యువత మాత్రమే నాగబాబు వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. కానీ మిగిలిన వారు మాత్రం రావడం లేదు. 
 
ఎవరు వచ్చినా రాకున్నా తాను మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగానే గడుపుతున్నారు నాగబాబు. తనకు టిడిపి, వైసిపి నాయకుల్లాగా వేరే వ్యాపారాలు లేవని, తనకు తెలిసిందంతా కష్టపడి పనిచేయడం, ప్రజా సేవ చేయడం మాత్రమేనంటున్నారు నాగబాబు. మరి చూడాలి ప్రజలు నాగబాబును ఎలా ఆదరిస్తారో..