సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (11:25 IST)

ఎవరు చేసినా తప్పు తప్పే .. నాకు మీరందం మీరు నాకందం...

couples
వెళుతున్నాం నేనూ మా శ్రీవారు
సముద్ర తీరం వెంట
 
చేరుతున్నాయి అలుపెరుగని అలలు మా పాదాల చెంత
నడుస్తున్నాము మాట్లాడుకుంటూ సంతోషంగా
 
వెళుతోంది ఓ ఆవిడ మా ముందుగా
చూశారు ఆవిడను మా వారు తదేకంగా
 
చెప్పారు నాతో ఆమె అందచందాల గురించి వేగంగా
వర్ణించారు ఆమెను శిరస్సు నుండి పాదాల వరకు పరిపూర్ణంగా
 
నచ్చ లేదు నాకది పూర్తిగా
వస్తున్నాడు ఓ మగాడు మా కెదురుగా
 
వర్ణించాను నేనూ అతని గురించి అందంగా
ఆపమన్నారు మా వారు మధ్యలోనే  విసుగ్గా
 
వర్ణించారు మీరు నా ఎదుటే ఓ స్త్రీని
వర్ణించాను నేనూ మీలానే ఓ మగాడిని
 
అడిగాను నేను మీకు లేని తప్పు నాకేంటని
భార్యతో భర్త మరో స్త్రీ అందచందాలను వర్ణించడం
 
భర్తతో భార్య మరో మగాడి గురించి చెప్పడం
ఎవరు చేసినా తప్పు తప్పే
 
నాకు మీరందం మీరు నాకందం
వద్దు మన మధ్య సంవాదం
 
మౌనం పాటించాడు
రాలేదతని నోట మారు మాట
 
పదండి మన ప్రయాణాన్ని సాగిద్దాం
సముద్రపు అలలు వేగంగా పైకెగరడంతో
పట్టుకుంది గట్టిగా భర్త చేతిని.
 
రచన : గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై