సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By వెంకటేశ్వర రావు. ఐ
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (22:51 IST)

ఇదేరా మన ప్రేమ

వచ్చేపోయే నూతన వత్సరం కాదు మన ప్రేమ
ప్రతి ఏటా పలుకరించే పండుగ కాదు మన ప్రేమ
 
ఆకులు రాలే కాలం లాంటిది కాదు మన ప్రేమ
కమ్ముకునే కరిమబ్బు కాదు మన ప్రేమ
బండలు పగిలే మండు వేసవి కాదు మన ప్రేమ
 
ఉదయించే సూరీడి కిరణాలు కావు మన ప్రేమ
చల్లని వెన్నెల పంచే జాబిలి చల్లదనం కాదు మన ప్రేమ
మలయమారుతంలా పరుగులు తీసే పైరుగాలి కాదు ప్రేమ
 
క్షణాలైనా
యుగాలైనా
రేయైనా
పగలైనా
 
ప్రతిక్షణం నీలో నేను
నాలో నీవు... 
ఇదేరా మన ప్రేమ.