శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (22:44 IST)

నీ రాకకై ఎదురుచూసే నా హృదయం

కనురెప్పల మాటున నను దాచుకున్న ప్రియతమా
హృదయాంతరాళలో నను గూడుకట్టుకున్న ప్రణయమా
ఉషోదయపు వెలుతురుల్లో నను పలుకరించే కుసుమమా
సాయం సంధ్యల్లో నను పెనవేసుకునే మలయమారుతమా
 
ప్రకృతంత ప్రేమనంతా పంచే పరువమా
వెన్నెలంత జాబిలిని ఇచ్చే నయగారమా
అలల పాల నురగల నవ్వుల్ని పూయించే కెరటమా
అందాలను హరివిల్లుగా చేసి కలిసిపోయే కమనీయమా
 
యుగయుగానికి
నీ రాకకై ఎదురుచూసే
నా హృదయం
నీకు అంకితం