శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (16:16 IST)

రంగారెడ్డిలో ఆటో బోల్తా... ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తా ప‌డటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప‌డింది. 
 
ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.