సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:01 IST)

ప్రేమ చర్చకు దారి తీసినప్పటికీ..?

ప్రేమ అంటే దయ, అభిమానంతో కూడిన అనేక తీవ్రమైన భావాల అనుభవాలనే ప్రేమని చెప్పొచ్చు. ప్రేమ అనే పదం విభిన్న భావాలను, స్థితులను, వైఖరులను, సాధారణ ఆనందం నుండి తీవ్రమైన వ్యక్తిగత ఆకర్షణల వరకు సూచిస్తుంది. ఈ విధంగా విభిన్నమైన ఉపయోగాలు, అర్థాల వలన, సంక్లిష్టమైన భావాలతో కలిసి ఉన్నందువలన, ప్రేమని సాధారణంగా నిర్వచించడమే కాక ఇతర భావ స్థితులతో పోల్చడం కూడా కష్టసాధ్యం. 
 
ప్రేమ అనేది మరొక వ్యక్తి కొరకు సున్నితంగా పదిలపరచుకునే ఒక లోతైన, అవ్యక్తభావన. ప్రేమ యొక్క ఈ చిన్ని భావన అనేక రకాలభావాల నిధిలోకి చేరుతుంది. అలానే తపనతో కూడిన కోరిక, భక్తితో కూడిని మతపరమైన ప్రేమ వరకు అన్నీ తెలుసుకోవాలి. ప్రేమ దాని వివిధ రూపాల్లో వ్యక్తుల సంబంధాల్లో ఒక ప్రధాన పాత్ర పోషించడమేకాక అనిశ్చితమైన మానసిక ప్రాముఖ్యతకు కేంద్రమవడం, సృజనాత్మక కళల్లో చాలా మామూలు మూలాల్లో ఒకటి. 
 
లవ్ అనే ఆంగ్ల పదం వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్థాలను సూచిస్తుంది. విభిన్న విషయాలను వివరించడానికి తరచు ఇతర భాషలు, అనేక పదాలను ఉపయోగించినప్పటికీ, ఆంగ్ల భాష మాత్రం ప్రేమ అనే పదంపైనే ఆధారపడుతుంది. ప్రేమ యొక్క గుణం లేదా సారం తరచు చర్చలకు దారి తీసినప్పటికీ, ఏది ప్రేమ కాదో వివరించే అనేక వివరణలు ఇవ్వబడుతాయి.