నిజమైన ప్రేమను చూపిస్తే...?

Last Updated: శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:03 IST)
ప్రస్తుత కాలంలో యువతీయువకుల మధ్య సర్వసాధారణంగా మారిపోయింది. ప్రేమికుల్లో నిజమైన ప్రేమను చూపించేవారు ఎంతమంది ఉన్నారు.. నిజమైన ప్రేమకు కొలబద్ద ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. మంచి అందమైన అమ్మాయిల ప్రేమను పొందడానికి యువకుల్లో ఉండాల్సింది సిన్సియారిటీ. ప్రేమికుల్లో ఇది ఉన్నట్టయితే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది.

సాధారణంగా ప్రతీ స్త్రీ కోరుకునేది.. తనకు భర్తగా వచ్చే వ్యక్తి నిజమైన ప్రేమను పంచగలిగే వారులా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఇందుకు సంబంధించిన ఒక సర్వేలో పాల్గొన్న అమ్మాయిలను ప్రశ్నించగా నిజమైన ప్రేమ ముందు.. అన్ని బలాదూర్ అని తెలింది. భర్త సంపన్నుడు కాలేకపోయినా ఫర్వాలేదు కానీ.. మంచి సరసుడై ఉండాలని చాలామంది యువతులు చెప్పారు. అయితే 15 నుండి 20 శాతం మంది అమ్మాయిలు మాత్రం తమ భర్తలు మంచి దేవదారుఢ్యం కలిగి ఉండాలని కోరుకున్నారు.

ప్రపంచంలోని స్త్రీల కంటే భారతీయ మహిళకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ మహిళ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటపుడు నిజమైన ప్రేమకే పెద్దమీట వేస్తుందని సర్వేలో వెల్లడించారు. కనుక అబ్బాయిల.. మీరు ప్రేమించే వారిపట్ల నిజమైన ప్రేమను చూపిస్తే సరిపోతుంది.
దీనిపై మరింత చదవండి :