శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (13:39 IST)

20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారు.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య

ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో వున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటక రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు వేడెక్కింది.

బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం టచ్‌లోనే ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి యడియూరప్ప పని తీరుపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో అన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ప్రయత్నాలు ఎంతమాత్రమూ చేయమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ మాట్లాడుతూ..... సిద్దరామయ్య ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.