పనిచేయని స్పైస్‌జెట్ విమాన రాడార్ విఫలం.. వెనక్కి రప్పించి ల్యాండింగ్
గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్ విమాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాటిని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వంటి వార్తలు వింటున్నారు. గత మూడు వారాల్లో మొత్తం 8 సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం మూడో ఇన్సిడెంట్ జరిగింది.
తాజాగా చైనాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో రాడార్ విఫలమైంది. దీంతో దాన్ని మధ్యలోనే దారి మళ్లించారు. ఆ విమానం కోల్‌కతాకు చేరుకుంది. ఈ విమానంలో ఉన్న వెదర్ రాడార్ పనిచేయకపోవడంతో వెనక్కి రప్పించారు.
ఈ స్పైస్‌జెట్ విమానం బోయింగ్ 737 కార్గో విమానం కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సివుంటుంది. అయితే, జూలై అయిదో తేదీన టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ విమానంలో వెదర్ రాడార్ పనిచేయలేదు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి తీసుకున్నారు. పైగా, ఈ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.