ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (19:10 IST)

తెలంగాణ ఆర్టీసీ అదుర్స్: ఒక్కరోజే రూ.15.59 కోట్ల ఆదాయం

tsrtc
తెలంగాణ ఆర్టీసీ విషయంలో ఎండీ సజ్జనార్ కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నారు. దేవాలయాలకు, పండుగలకు, పరీక్షలకు, వేసవి సెలవులకు, జాతరలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తూ, ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

 
ఇటీవల కాలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజంతా మాతృమూర్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఆఫర్‌ను తీసుకొచ్చారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని, బస్ పాస్‌ల విషయంలో రాయితీలను తగ్గిస్తూ, నిర్ణయం తీసుకున్నారు.

 
ఈ క్రమంలో కరోనా తర్వాత మంగళవారం రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆర్టీసీ రూ. 15.59 కోట్లను సంపాదించి పెట్టింది. ఈ స్థాయిలో ఆదాయం రావడం గత మూడు నెలల్లో ఇదే తొలిసారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.