బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (19:07 IST)

42 ఏళ్ల మహిళ 8 ఏళ్ల బాలుడిని వేధించింది... ఆడుకుంటున్న పిల్లాడిని?

42 ఏళ్ల మహిళ ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన ఢిల్లీలోవి ద్వారకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 13న సాయంత్రం 6 గంటల సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటుండగా ఓ మహిళ (42) అతన్ని దగ్గకు పిలుచుకొని బాలుని ప్రైవేట్ పార్ట్‌లో ఓ వస్తువును చొప్పించి లైంగికంగా వేధించిందని పోలీసులు తెలిపారు.
 
అతడు ప్రతిఘటించడంతో చెంపలపై కొట్టింది. ఘటన అనంతరం బాలుడు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి వివరించాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలుడిపై అసహజ రీతిలో లైంగిక చర్య జరిగిందని గుర్తించి ఆ 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు.