బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ఐఏఎస్​ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా

ఓ ఐఏఎస్​ అధికారి మొబైల్​కు నకిలీ కెవైసీ లింక్​ను పంపి, బ్యాంక్​ నుంచి ఏకంగా 6.10 లక్షలను కాజేసిన ఘటన రాజస్థాన్ ఉదయ్​పుర్​లో చోటు చేసుకుంది. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సైబర్​ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో సామాన్య ప్రజలే కాదు ఐఏఎస్​ అధికారులూ పడుతున్నారు. తాజాగా రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లా ఐఏఎస్​ అధికారికి చరవాణికి నకిలీ కెవైసీ లింక్​ పంపి, బ్యాంక్​ ఖాతా నుంచి 6.10 లక్షలను కాజేశాడు ఓ మోసగాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ జరిగింది... రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లాలో జాడోల్​ సబ్​ డివిజన్​ మేజిస్ట్రేట్​గా చేస్తున్నారు డాక్టర్​ శుభమంగ్ల. అక్టోబర్​ 21న బ్యాంక్​ ఖాతాకు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలంటూ ఆమె ఫోన్​కు ఓ లింక్​ పంపించాడు ఆగంతుకుడు.

ఆ లింక్​ ఓపెన్​ చేసి తనకు సంబంధించిన అన్ని వివరాలను నింపారు శుభ. పూర్తి చేసిన కొంత సమయం తర్వాత బ్యాంక్​ ఖాతా నుంచి మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా రూ. 6.10 లక్షల నగదు విత్​డ్రాఅయినట్లు ఆ ఐఏఎస్​ అధికారి గుర్తించారు.

నగదు బదిలీ కావటాన్ని గుర్తించిన ఆమె వెంటనే జాడోల్​ పోలీస్​ స్టేషన్​, ఉదయ్​పుర్ సైబర్​ సెల్​లో కేసు నమోదు చేశారు. కానీ ఆమె బ్యాంక్​ ఖాతా బెంగళూరులో తెరిచినందున అధికారులు ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసి విచారణను వేగవంతం చేశారు.