మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:44 IST)

చిరుత దాడి.. బహిర్భూమికి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

చిరుత పులులు అడవుల్లో కాకుండా ప్రస్తుతం జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇలా గ్రామాలపై పడుతున్న చిరుతల కారణంగా నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా చిరుత దాడిలో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
 
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే మొత్తం ఐదుగురు చిన్నారులు చిరుత దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఐదేళ్ల బాలిక రాత్రి గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళింది. 
 
అప్పటికే పొదలమాటున దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు వచ్చి చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. 
 
కాగా, ఆ ప్రాంతంలో ఇది ఐదో ఘటనగా స్థానికులు చెబుతున్నారు. గత నెల 24న తొలిసారి ఓ బాలికపై చిరుత దాడిచేసింది. వరుస ఘటనలతో తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.