బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (09:41 IST)

దేశంలో మరణాలకు ఆ మూడే ప్రధాన కారణం?

corona deaths
దేశంలో సంభవించే మరణాలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా హృద్రోగ సమస్యలు, న్యూమోనియో, ఆస్తమా అని రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 
 
గత 2020లో దేశంలో సంభవించిన మరణాల్లో 42 శాతం ఈ మూడింటి వల్లే సంభవించినట్టు పేర్కొంది. అలాగే, అదే యేడాది సంభవించిన మరణాల్లో వైద్య పరంగా ధృవీకరించిన 18 లక్షల మరణాల్లో 9 శాతం కరోనా కారణంగా సంభవించినట్టు పేర్కొంది. 
 
2020లో దేశ వ్యాప్తంగా 81.15 లక్షల మరణాలు సంభవించాయి. ఇందులో వైద్యులు ధృవీకరించిన మరణాలు మాత్రం 18,11,688 మాత్రమేనని తెలిపింది. వీరిలో హృద్రోగ సమస్యల కారణంగా 32.1 శాతం మంచి చనిపోగా, శ్వాస వ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10 శాతం మంది ప్రాణాలు విడిచారు. 9 శాతం మంది కరోనాతో చనిపోయినట్టు ఆ నివేదిక పేర్కొంది.