మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (10:03 IST)

ఓలా స్కూటర్‌ను ఎవరూ కొనుగోలు చేయొద్దు.. యువతి వినూత్న ప్రచారం

Simple One e-scooter
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎవరూ కొనుగోలు చేయొద్దంటూ బెంగుళూరుకు చెందిన ఓ యువతి వినూత్న ప్రచారం చేశారు. తాను కొనుగోలు చేసిన స్కూటర్ ప్రతిసారీ పాడవుతున్న తయారీ కంపనీ ఓలా స్పందించడం లేదని వాపోయింది. ఇదే విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే స్కూటర్‌కు మరమ్మతులు చేసేందుకు కూడా కంపెనీ ప్రతినిధులు ఏమాత్రం సిద్ధంగా లేరని ఆరోపించింది. 
 
దీంతో విసిగిపోయిన ఆ యువతి.. చివరకు తన వాహనంపై రాసిన ఫిర్యాదు కాగితాన్ని అంటించిన నిశాగౌరి అనే వినియోగదారురాలు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. పోస్టు వైరల్ కావడంతో సంస్థ ప్రతినిధులు స్పందించారు. వాహనాన్ని మరమ్మతు చేసేందుకు తీసుకువెళుతూ, అప్పటివరకు నడుపుకొనేందుకు ఆమెకు తాత్కాలికంగా ఒక వాహనాన్ని అందించి వెళ్లారు. కొత్తగా కొనుగోలు చేసుకున్న ఓలా బైకుకు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని కలబురగిలో ఒక వినియోగదారుడు షోరూమ్‌కు గత వారం నిప్పు పెట్టి, పోలీసు ఠాణాలో లొంగిపోయిన విషయం విదితమే.