శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 30 జులై 2018 (19:18 IST)

ప్రేయసి కోసం ఇంటికొచ్చి ఆమె తల్లితో రాసలీలలు... పట్టుకుంది...

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. యువతిని ప్రేమించిన ఒక యువకుడు ఏకంగా యువతి తల్లికి బాగా దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో ప్రతిరోజు యువతి ఇంటికి వచ్చి వెళుతూ ఆమె తల్లితో రాసలీలలు కొనస

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. యువతిని ప్రేమించిన ఒక యువకుడు ఏకంగా యువతి తల్లికి బాగా దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో ప్రతిరోజు యువతి ఇంటికి వచ్చి వెళుతూ ఆమె తల్లితో రాసలీలలు కొనసాగించాడు. అయితే ఒకరోజు ఆ కుమార్తెకు తెలిసి పోయింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మధురై నగరానికి చెందిన సిద్ధు అనే యువకుడు శాంతి అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ బి.ఎ. చదువుతున్నారు. శాంతితో సంవత్సరం పాటు ప్రేమాయణంలో ఉన్న సిద్ధును నేరుగా ఇంటికి తీసుకెళ్ళింది యువతి. సిద్ధును ప్రేమిస్తున్నట్లు తల్లికి చెప్పింది. కుమార్తె ప్రేమను తల్లి మేఘ అంగీకరించింది. మేఘ భర్త పదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 
 
అప్పటి నుంచి మేఘనే స్థానికంగా ప్రొవిజన్ షాపు నడుపుతూ కుటుంబ పోషణ చూస్తోంది. ప్రేమ పేరుతో ప్రతిరోజు సిద్ధు ఇంటికి వస్తూ మేఘతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మూడు నెలల పాటు వీరి మధ్య ఈ తతంగం జరిగింది. సిద్ధు తన ఇంటికి పదేపదే ఎందుకు వస్తున్నాడో శాంతికి అర్థంకాలేదు. రెండు రోజుల క్రితం తన తల్లితో అసభ్యకర రీతిలో సిద్ధు ఉండగా గమనించింది శాంతి.
 
ఆ తరువాత తల్లి మేఘనను హెచ్చరించింది. సిద్ధుపై మధురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నమ్మించి మోసం చేసిన సిద్ధును అరెస్టు చేయాలని, తన తల్లిని కూడా శిక్షించాలంటోంది శాంతి.