గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:52 IST)

ఇక 4 వారాలకే కొవిషీల్డ్‌ రెండో డోసు?

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్నాక 12-16 వారాల్లోగా రెండో డోసు తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది.

ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో కొవిషీల్డ్‌ తీసుకున్న వారికి 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకునే అవకాశం కల్పించాలని సర్కారు యోచిస్తోంది. కాగా, దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 6 నెలల కనిష్ఠానికి తగ్గి 3,01,989కి చేరింది.

26,964 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లు దాటింది. మరో 383 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 4.45 లక్షలకు చేరింది. బెంగళూరులో శిక్షణ పొందుతున్న 34 మంది బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.