ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:38 IST)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

bhagwant mann
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉనికిలో లేని మంత్రిత్వశాఖకు ఓ మంత్రి 20 నెలలుగా ఉన్నారు. దీన్ని సవరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ఒక జోక్‌గా ఉందని పేర్కొంది. 
 
కాగా, గత 2022 మార్చి నెలలో పంజాబ్ రాష్ట్రంలో భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023లో మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించారు. ఇందులో ఒకటి ప్రవాస భారతీయ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కాగా రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్టుమెంట్. 2024 ఆఖరులో మరోమారు పనర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే, దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్‌కు కేటాయించిన కేటాయించిన శాఖను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. కాగా, లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో పాలనకు ఆప్ పాలన ఒక జోక్‌గా మార్చివేసిందన్నారు.