గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:44 IST)

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హార్పిక్ తాగిన అడ్వకేట్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అడ్వకేట్ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఇంటికి రావడం గమనించిన అతడు వారికి భయపడి హార్పిక్ తాగాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని సికింద్రాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కి తరలించారు.


అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
 
రామారావు అనే వ్యక్తి అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నాడు. మంచి వృత్తిలో ఉన్నప్పటికీ అతడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. తన వద్ద పని చేస్తున్న జూనియర్ అడ్వకేట్‌ని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. రామారావు తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని సదరు జూనియర్ అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామారావును పట్టుకోవడానికి ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం ఇంటికి వెళ్లారు.
 
వెంటనే రామారావు వెళ్లి బాత్ రూంలోకి వెళ్లి దాక్కున్నాడు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న హార్పిక్‌ని తాగాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. గతంలో రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసిన అడ్వకేట్ ఇతనే అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.