నిర్భయ దోషి కొత్త ఎత్తు... శిక్ష తగ్గించాలంటూ గవర్నర్‌కు పిటిషన్
నిర్భయ కేసులోని దోషుల్లో వినయ్ గుప్తా అనే ముద్దాయి మరో కొత్త ఎత్తు వేశాడు. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20వ తేది ఉదయం ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అయితే, ఈ శిక్షలను తప్పించుకునేందుకు ఈ నలుగురు ముద్దాయిలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇపుడు వీరికి దారులన్నీ మూసుకునిపోయాయి.
ఈ క్రమంలో వినయ్ గుప్తా అనే దోషి సరికొత్త ఎత్తుగడ వేశాడు. తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్‌ను కోరాడు.
మరి, ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... కోర్టు తాజాగా జారేసిన డెత్ వారెంట్ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలుచేస్తారా? లేదా? అనే అంశంపై ఇపుడు సందిగ్ధత నెలకొంది.